Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 61

Story of Sunahsepha- 1 !!

|| om tat sat ||

బాలకాండ
అరువదియొకటవ సర్గము

విశ్వామిత్రోమహాత్మాsథ ప్రస్థితాన్ ప్రేక్ష్య తాన్ ఋషీన్ |
అబ్రవీన్నరశార్దూల సర్వాంస్తాన్ వనవాసినః ||

స|| హే నరశార్దూల ! అథ మహాత్మా విశ్వామిత్రః తాన్ ప్రస్ఠితాన్ ఋషీన్ ప్రేక్ష్య తాం సర్వాన్ వనవాసినః అబ్రవీత్ |

తా|| 'ఓ నరశార్దూల ! అప్పుడు మహత్ముడైన విశ్వామిత్రుడు వెళ్ళిపోవుటకు సిద్ధముగానున్న ఋషులను వనవాసులను అందరినీ చూచి ఇట్లు పలికెను'.

మహాన్ విఘ్నః ప్రవృత్తోsయం దక్షిణామాస్థితో దిశమ్ |
దిశమన్యాంప్రపత్స్యామః తత్ర తప్స్యామహే తపః ||

స|| అయం దక్షిణ దిశమ్ మాస్థితః మహాన్ విఘ్నః ప్రవృత్తః | అన్యాం దిశమ్ ప్రపత్స్యామః | తత్ర తపః తప్స్యామహే ( వయం)||

తా|| "ఈ దక్షిణ దిశలో వుండి మహత్తరమైన విఘ్నములు కలిగినవి. ఇంకొక దిశలో చేరెదము. అక్కడ తపస్సు చేసెదము".

పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః|
సుఖమ్ తపశ్చరిష్యామః వరం తద్ధి తపోవనమ్ ||

స|| విశాలాయాం పశ్చిమాయాం పుష్కరేషు మహాత్మనః ( సన్తి) | తత్ర సుఖం తపః చరిష్యామః| తద్ధి తపోవనమ్ వరం (అస్తి)|

తా|| "విశాలమైన పశ్చిమ దిశలో పుష్కరములలో మహాత్ములు ఉండెదరు. అచట సుఖముగా తపస్సు చేసెదము. అచటి తపోవనములు శ్రేష్ఠమైనవి".

ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః|
తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ||

స|| మహాతేజాః మహామునిః ఏవం ఉక్త్వా పుష్కరేషు మూల ఫలాశనః ఉగ్రం దురాదర్షం తపః తేపే ||

తా|| 'మహతేజోవంతుడైన ఆ మహాముని ఇట్లు చెప్పి ఆ పుష్కరములలో ఫలమూలములు గ్రహించుచూ అగ్రమైన ఇతరులకు శక్యముకాని తపస్సు చేసెను'.

ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః |
అంబరీష ఇతి ఖ్యాతో యష్ఠుం సముపచక్రమే ||

స|| ఏతస్మిన్నేవ కాలే అయోధ్యాధిపతి అంబరీష ఇతి ఖ్యాతో నృపః యష్టుం సముపచక్రమే ||

తా|| 'అదే కాలములో అయోధ్యాధిపతి అంబరీషుడని పేరు గలవాడగు రాజు యజ్ఞము ప్రారంభించెను'.

తస్యవై యజమానస్య పశుమింద్రో జహార హ |
ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమ్ ఇదమబ్రవీత్ ||

స|| యజమానస్య తస్య పశుం ఇంద్రో జహార హ | పశౌ ప్రణష్టే తు విప్రాః రాజానమ్ ఇదం అబ్రవీత్ ||

తా|| 'ఆ యజమానియొక్క ఆ యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించెను. పశువు అపహరింపబడగా అ పురోహితులు రాజునకు ఇట్లు చెప్పిరి'.

పశురద్య హృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్ |
అరక్షితారం రాజానం ఘ్నంతి దోషా నరేశ్వర ||

స|| హే రాజన్ ! తవ దుర్నయాత్ అద్య పశుః హృతో ప్రణష్టః | హే నరేశ్వరా ! అరక్షితారం రాజానం దోషా ఘ్నంతి ||

తా|| "ఓ రాజన్ ! నీ దురదృష్టము వలన ఈ దినమున పశువు అపహరింపబడి కనపడుటలేదు. ఓ రాజా ! రక్షింపలేకపోయిన దోషము రాజుని హతమార్చును".

ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతత్ నరం వా పురుషర్షభ |
ఆనయస్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే ||

స|| హే పురుషర్షభ ! ఏతత్ మహత్ ప్రాయశ్చిత్తం శీఘ్రం అనయశ్వ పశుం వా నర యావత్ కర్మ ప్రవర్తతే ||

తా|| "ఓ రాజా ! దీనికి మహత్తరమైన ప్రాయశ్చిత్తము కొఱకు శీఘ్రముగా ఈ కర్మ జరుగుచుండగా యజ్ఞపశువును లేక ఒక నరుని తీసుకు రావలెను".

ఉపాధ్యాయ వచః శ్రుత్వా స రాజా పురుషర్షభ |
అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహశ్రసః ||
దేశాన్ జనపదాం స్తాం స్తాన్ నగరాణి వనాని చ |
ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః ||

స|| ఉపాధ్యాయ వచః శ్రుత్వా స రాజా పురుషర్షభ పశుం గోభిః సహస్రశః మహాబుద్ధిః అన్వియేష || మార్గమాణో మహీపతిః దేశాన్ జనపదాం నగరాణి వనాని పుణ్యాని ఆశ్రమానిచ ||

తా|| 'పురోహితుని మాటలను విని ఆ రాజు పశువు కోసము వేలకొలది గోవులతో బుద్ధిమంతుని కోసరము అ మహీపతి జనపదములు నగరములు వనములు పుణ్యమైన ఆశ్రమముల తో కూడిన ఆ మార్గములో వెదక సాగెను'

స పుత్త్ర సహితం తాత సభార్యం రఘునందన |
భృగుతుంగే సమాసీనమ్ ఋచీకం సందదర్శహ ||

స|| హే తాత !హే రఘునందన ! భృగుతుంగే స భార్యం స పుత్త్ర సహితం సమాసీనం ఋచీకం సం దదర్శ హ ||
తా|| 'ఓ రఘునందన !నాయనా ! భ్రుగుతుంగములో భార్యా పుత్త్రులతో సమాసీనుడైన ఋచీక మహర్షిని చూచెను'.

తమువాచ మహాతేజాః ప్రణమ్యాభి ప్రసాద్యచ |
బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిరమిత ప్రభః ||

స|| ప్రణమ్య అభి ప్రసాద్య చ బ్రహ్మర్షిం తపసా దీప్తం మహాతేజాః అమిత ప్రభః రాజర్షిః తం ఉవాచ ||

తా|| 'ప్రణామము చేసి, ప్రసన్నుని కావించుకొని మహా తేజము కల , తపస్సుయొక్క తేజస్సు తో ప్రకాశించుచున్న ఋచీకునితో రాజు ఇట్లనెను',

పృష్ట్వాసర్వత్ర కుశలం ఋచీకం తం ఇదం వచః |
గవాం శతసహస్రేణ విక్రీనీషే సుతం యది ||
పశోరర్థే మహాభాగ కృతకృత్యోsస్మి భార్గవ |

స|| సర్వత్ర కుశలం పృష్ట్వా తం ఋచీకం ఇదం వచః (వదతి) హే భార్గవ పశోః అర్థే యది సుతం విక్రీషే కృత కృత్యోస్మి |

తా|| 'అన్ని కుశలములను అడిగిన తరువాత ఋచీకునితో ఇట్లు పలికెను. "ఓ భార్గవ ! పశువు కొఱకు సుతుని విక్రయించినచో నేను కృత కృత్యుడనగుదును".

సర్వే పరిసృతా దేశా యాజ్ఞీయం న లభే పశుమ్||
దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ ||

స|| యాజ్ఞీయం సర్వే దేశా పరిసృతా | న లభే పశుం| మూల్యేన సుతం ఏకం దాతుం అర్హసి |

తా|| "ఈ యజ్ఞపశువు ని కోసము అన్ని దేశములు గాలించితిని . కాని ఆ పశువు కనపడుటలేదు. మూల్యముతో ఒక సుతును ఇమ్ము".

ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః |
నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన ||

స|| మహాతేజా ఏవం ఉక్తో ఋచీకః ఇదం వచః అబ్రవీత్ | నరశ్రేష్ఠ అహం జ్యేష్ఠం కథంచన న విక్రిణీయాం |

తా|| 'అ మహాతేజో వంతుడుఇట్లు చెప్పగా ఋచీకుడు ఇట్లు పలికెను."ఓ నరశ్రేష్ఠ ! నేను జ్యేష్ఠపుత్రుని ఎట్టి పరిస్థితులలోను విక్రయింప జాలను".

ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్ |
ఉవాచ నరశార్దూలమ్ అంబరీషం తపస్వినీ ||

స|| ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మహాత్మనామ్ తపశ్వినీ మాతా నరశార్దూలం అంబరీషం ఉవాచ |

తా|| 'మహాత్ముడైన ఋచీకుని వచనములను విని తపశ్విని వారియొక్క మాత నరశార్దూలమైన అ అంబరీషునితో ఇట్లుపలికెను'.

అవిక్రేయం సుతం జ్యేష్ఠమ్ భగవానాహ భార్గవ |
మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప |
తస్మాత్ కనీయసం పుత్త్రం న దాస్యే తవ పార్థివ ||

స|| భగవాన్ భార్గవ జ్యేష్ష్ఠం సుతం న విక్రేయం (ఇతి) ఆహ |హే పార్థివ ! మమాపి కనిష్ఠం శునకం దయితం విద్ధి |తస్మాత్ కనీయసం పుత్త్రం తవ న దాస్యే |

తా|| "భగవాన్ భార్గవ జ్యేష్ఠపుత్రుని విక్రయింపజాలను అని చెప్పెను. ఓ రాజా ! నాకు కూడా కనిష్ఠ కుమారుని పై ప్రాణము. అందువలన కనిష్ఠపుత్త్రుని కూడా విక్రయింప జాలము".

ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్టాః పితృషు వల్లభాః |
మాతౄణాంతు కనీయాంసః తస్మాద్రక్షే కనీయసమ్ ||

స|| హే నరస్రేష్ఠ ! ప్రాయేణ జ్యేష్ఠాః పితృషు వల్లభాః | మాతౄణాం కనీయాంసః | తస్మాత్ రక్షే కనీయసమ్ |

తా|| "ఓ నరశ్రేష్ఠ ! బహుశః పెద్ద కుమారుడు తండ్రికి ప్రియమైనవాడు. తల్లులకు చిన్న వాడు. అందువలన కనిష్ఠుని రక్షింపవలెను".

ఉక్తవాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథైవ చ |
శునశ్శేఫః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్ ||

స|| హే రామ ! మునౌ తథైవ చ మునిపత్న్యాం ఉక్త వాక్యే మధ్యమః శునశ్శేఫః వాక్యం అబ్రవీత్ ||

తా|| 'ఓ రామా ! ముని ఆదే విథముగా మునిపత్ని చెప్పిన మాటల విని మధ్యముడగు శునశ్శేఫుడు ఇట్లు పలికెను'’.

పితా జ్యేష్ఠం అవిక్రేయం మాతా చాహ కనీయసమ్ |
విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్త్రం నయస్వమామ్ ||

స|| "హే రాజన్ ! పితా జ్యేష్టం అవిక్రేయం మాతా చ కనీయసం ఆహ | మధ్యమం పుత్త్రం విక్రీతం మన్యే || రాజన్ నయస్వ మామ్

తా|| "ఓ రాజా ! తండ్రి జ్యేష్ఠకుమారుని అమ్మడు. తల్లి చిన్నవాన్ని అమ్మను అనెను.(అందుకని) మధ్యమ పుత్రుని అమ్మినట్లే తలంతును. ఓ రాజన్ నన్ను తీసుకు పొమ్ము."

గవామ్ శతశస్రేణ శ్శునశేఫం నరేశ్వరః |
గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన |

స|| హే రఘునందన ! గవాం శతసహస్రేణ శునశేఫమ్ గృహీత్వా పరమ ప్రీతో నరేశ్వరః జగామ |

తా|| ఓ రఘునందన! వంద వేల గోవులను ఇచ్చి శునశేఫుని తీసుకొని అతి సంతోషముతో ఆ రాజు వెళ్ళెను.

అంబరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః |
శునశ్శేఫం మహాతేజా జగామాశు మహాయశాః ||

స|| రాజర్షీ మహాతేజా మహాయశాః అంబరీషస్తు శునశ్శేఫం రథమ్ ఆరోప్య అశు జగామ ||

తా|| రాజర్షీ మహాతేజోవంతుడు అయిన అంబరీషుడు శునశేఫుని రథముపై కూర్చొనబెట్టి తన నగరమునకు వెళ్ళెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలాకాండే ఏకషష్ఠితమస్సర్గః ||

||ఈవిథముగా శ్రీమ్ద్రామాయణములో బాలకాండలో అరువది ఒకటవ సర్గము సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||